TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'తూర్పు' ఎక్సైజ్ శాఖలో కోల్డ్ వార్

Published on: Sun Feb 19, 2012 8:27AM

తూర్పు గోదావరి: తూర్పు గోదావరి జిల్లాలోని ఎక్సైజ్ యంత్రాంగంలో ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తోంది. ఏసీబీ దాడుల్లో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు ఇతరులతో కుమ్మక్కై తమను ఇరికించారని క్రిందిస్థాయి అధికారులు ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఏసీబీ రిమాండ్ రిపోర్టులో ఎక్సైజ్ శాఖ పొందిన నెలవారీ మామూళ్ళ వివరాలను ఉంచినప్పటికీ ఉన్నతాధికారుల పేర్లు మాయమయ్యాయి. క్షేత్ర స్థాయి అధికారులకు ముట్టిన సొమ్మును పేర్లతో సహా ఉంచిన ఏసీబీ పై అధికారుల వివరాలను మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. వాస్తవానికి ఎక్సైజ్ శాఖలో వివిధ కేడర్ల అధికారులు, సిబ్బంది సిండికేట్లనుంచి మామూళ్ళు వసూలు చేసేవారే. ఉన్నతాధికారులు నెలనెలా లక్షలు మూట కట్టుకోవడం జగద్వితమే. కాని రిమాండ్ రిపోర్టులో వీరి పేర్లు లేకుండా క్రిందిస్థాయి ఉద్యోగుల పేర్లు మాత్రమే చేర్చారు. ఏసీబీ కూడా ఉన్నతాధికారులతో కుమ్మక్కైందని అందుకే వారి పేర్లు బైట పెట్టలేదని క్రిందిస్థాయి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ తమను బలిపశువులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని పైస్థాయి అధికారులకు ఎవరు ఎప్పుడు ఎంత ముడుపులిచ్చారో తమ వద్ద ఉన్న ఆధారాలను బహిర్గతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలతో ఉన్నతాధికారులు క్రిందిస్థాయి అధికారుల మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరింది.