కోటీశ్వరుడికి తెల్ల రేషన్ కార్డు
Published on: Sun Feb 19, 2012 8:21AM
ఆరేళ్ళుగా సబ్సిడీ సంక్షేమం అనుభవిస్తున్న వైనం
తూర్
పు గోదావరి: తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలో కోట్లాది రూపాయల ఆస్తికలిగిన ఓ నగల షాపు యజమానికి ప్రభుత్వాధికారులు ఆరేళ్ళక్రితం తెల్లరేషన్ కార్డు ఇచ్చారు. రావులపాలెం మండలం వెదిరేశ్వరానికి చెందిన పెదపూడి సూర్యనారాయణ, విజయ జ్యూయలరీ షాపు యజమాని, ఇతనికి మారుతి కారుతో పాటు కోట్లాది రూపాయల విలువైన భవనాలు, ఇళ్ళ స్థలాలు, వ్యవసాయ భూములు ఉన్నాయి. అయినప్పటికీ దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి జారీ చేసే తెల్లరేషన్ కార్డును పొందాడు. ఆరేళ్ళుగా రేషన్ దిపోనుంచి క్రమం తప్పకుండా బియ్య్హం, కిరోసిన్, పామాయిల్, కందిపప్పు ఇతర నిత్యావసర వస్తువులను తీసుకుంటున్నాడు. అంతేకాదు. ఆరోగ్యశ్రీ పధకం ద్వారా తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆపరేషన్ కూడా చేయించారు. చివరకు గుర్తు తెలియని వ్యక్తుల సమాచారం మేరకు అధికారులు తనిఖీలు నిర్వహించగా ఈ కోటీస్వరుడి భాగోతం వెల్లడైంది. దీంతో రెవెన్యూ అధికారులు అతనికి నోటీసులు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ, రేషన్ రూపంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించినందుకు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ నోటీసు ఇచ్చారు.


