తైవాన్ లో భారీ భూకంపం..

ఈరోజు తెల్లవారుజామున తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. దీంతో పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలిపోయాయి. మరోచోట 17 అంతస్తుల భవనం కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. దీనివల్ల చాలా మంది శిధిలాల కింద చిక్కుకుపోగా.. ముగ్గురు మరణించినట్టు సమాచారం. కాగా ఈశాన్య ప్రాంతంలోని కావోషింగ్ కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదయింది.