TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ జిల్లాల్లో భూకంపం వదంతులు

Published on: Wed Aug 20, 2014 6:33AM

 

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో బుధవారం తెల్లవారు ఝామున భూకంపం వచ్చిందన్న పుకార్లు వ్యాపించాయి. దాంతో ఈ నాలుగు జిల్లాల్లోని ప్రజలు భయంతో తెల్లవారుఝామునే ఇళ్ళలోంచి బయటకి వచ్చి రోడ్లమీద కాలక్షేపం చేస్తున్నారు. మళ్ళీ భూకంపం వస్తుందన్న భయంతో తాము ఇళ్ళలోకి వెళ్ళడానికి భయపడుతున్నామని అంటున్నారు. ఈ భూకంపం పుకార్లు ఫోన్ల ద్వారా వ్యాపించినట్టు తెలుస్తోంది. తెలంగాణలోని ఏ ప్రాంతంలో కూడా భూకంపం రాలేదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.