చైనాలో భూకంపం: 150 మంది మృతి
Published on: Sun Aug 3, 2014 8:48PM

చైనా వాయువ్య ప్రాంతంలోని యునాన్ రాష్ట్రం వెన్‌పింగ్ సమీపంలో భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో 150 మంది మృతిచెందినట్లు సమాచారం. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.1గా నమోదైనట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. యునాన్‌లోని లాంగటౌషన్‌వద్ద భూకంప కేంద్రం కనుగొన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.1970 యున్నస్ సంభవించిన భూకంపంలో 15వేల మంది ప్రాణాలు కోల్పోయారు.


