చైనాలో భూకంపం: మృతులు 360 మంది
Published on: Mon Aug 4, 2014 10:26AM
.jpg)
నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్లో జరిగిన భారీ భూకంపంలో 360 మంది మరణించారు. ఇప్పటి వరకు 181 మంది గల్లంతు అయినట్టు తెలుస్తోంది. 1400 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకూ ఈ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం లాంగ్టౌషాన్ టౌన్షిప్ దగ్గర భూమిలో 12 కిలోమీటర్ల లోతులో వున్నట్టు గుర్తించారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలు మీద 6.5గా నమోదైంది. భూకంప కేంద్రానికి 23 కిలోమీటర్ల దూరంలో వున్న లుడియాన్ కౌంటీలో 120 మంది మరణించారు. 180 మంది గల్లంతయ్యారు. 1300 మంది గాయపడ్డారు. ఈ భూకంప తీవ్రత కారణంగా 12 వేల ఇళ్ళు కూలిపోయాయి. 30 వేల ఇళ్ళు దెబ్బతిన్నాయి. చైనా సరిహద్దుల్లో వున్న జపాన్, నేపాల్, ఇండియాలోని కొన్ని ప్రాంతాలు కూడా ఈ భూకంపం కారణంగా కంపించాయి.


