TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం

Published on: Thu Mar 2, 2017 10:08AM

హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. జమ్మూ, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు చంబా ప్రాంతంలో తెల్లవారు జామున 01.39 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ప్రాణభయంతో రోడ్లమీదకు పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. కాగా, నెల రోజుల్లో చంబా ప్రాంతంలో భూమి కంపించడం ఇది రెండోసారి.