పపువాలో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు

పపువా న్యూగినియాలో భారీ భూకంపంతో చిగురుటాకులా వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.0 గా నమోదైంది. పన్‌గున ఐలాండ్‌, బౌగన్‌విల్లే ఐలాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూక్రపంనలు చోటు చేసుకున్నాయి. భూకంప తీవ్రత భారీగా ఉండటంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఫసిఫిక్ మహాసముద్రంలో 95.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు.