శ్రీకాకుళం జిల్లాలో భూకంపం
Published on: Thu Dec 24, 2015 6:53PM

శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భూ ప్రకంపనలు సంభవించాయి. శ్రీకాకుళం పట్టణంలోని గుజరాతీపేట, పీఎస్ కాలనీ, ప్రాంతాలు... పొందూరు, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించింది. పొందూరు మండలంలో కినిమెట్ల, లోలుగు, కుందూరు, ఎచ్చెర్ల మండలంలోని కుచేలపురం, ఫరీద్పేట, ఎ.ఎ.వలస, జి.సిగడాం మండలంలో టంకాల దుక్కివలస గ్రామంలో నాలుగు సెకన్లపాటు భూమి కంపించింది. దాంతో ప్రజలు ఇళ్ళనుంచి బయటకి పరుగులు తీశారు.


