TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జపాన్ లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Published on: Thu Aug 8, 2024 2:13PM

జపాన్ ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపూ భూ కంప తీవ్రత 7.1గా నమోదైంది. మియోజాకి తీరం సమీపంలో సముద్ర మట్టానికి 30 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ తెలిపింది.

భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తోంది. కాగా భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు.