TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భూకంపం.. ఇండోనేసియాలో పాతిక మంది మృతి

Published on: Mon Nov 21, 2022 3:23PM

ఇండోనేసియాను భూకంపం వణికించింది. సోమవారం (నవంబర్ 21) మధ్యాహ్నం 5.6 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రతకు పలు ఇళ్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో కనీసం పాతిక మంది మరణించారు.

వందల సంఖ్యలో గాయపడ్డారు. వెస్ట్ జావాలో సంభవించిన ఈ భూ కంప తీవ్రత దృష్ట్యా మరణాల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్త మౌతోంది. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐదు రోజుల క్రిత  ఇండోనేషియా  సుమత్రా దీవుల్లో నైరుతి దిశలో  భూమి కంపించిన సంగతి విదితమే. రిక్టర్ స్కేల్ మీద ఆ భూకంప తీవ్రత 6గా నమోదయ్యింది. అప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే  సోమవారం సంభవించిన భూకంపం నివాస ప్రాంతాలలో సంభవించడంతో .   ప్రాణ, ఆస్థి నష్టం సంభవించింది.