TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణకు భూకంప హెచ్చరిక!?

Published on: Fri Apr 11, 2025 1:33AM

తెలంగాణకు  భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తోంది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత చాలా అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్, అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు. తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని.. ఆ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని అందులో పేర్కొంది.

 అయితే ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ భూకంపం సూచనలను ఎవరూ కూడా ధృవీకరించని పరిస్థితి. ప్రభుత్వ వర్గాలు గానీ, శాస్త్రీయ సంస్థలు కానీ ధృవీకరించడం లేదు. భూకంపాలను కచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదనీ, ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని అధికారులు చెబుతున్న మాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెసిఫిక్ జోన్ రెండు, మూడులో ఉన్నాయి. ఇవి తక్కువ నుంచి మోస్తరు భూకంప ప్రమాదాన్ని మాత్రమే సూచిస్తాయి. గతంలో ఈ ప్రాంతంలో కొన్ని చిన్న చిన్న భూకంపాలు సంభవించాయి. అవి ఏమాత్రం నష్టం కలిగించలేదు.