TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముందస్తు సిగ్న‌ల్స్‌.. రె'ఢీ'నా ?

Published on: Wed Feb 23, 2022 4:47PM

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకున్నాయి. నిజానికి తెలంగాణలో అయినా ఏపీలో అయినా ప్రస్తుత అసెంబ్లీలకు ఇంకా చాలా గడువుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుతం శాసన సభకు 2024 జూన్ 2 తేదీ వరకు గడువుంది. ప్రస్తుత ప్రభుత్వం ముందూ వెనక ఆలోచన లేకుండా ఐదేళ్ళ గడవు పూర్తయిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చేస్తే, లోక్ సభ ఎన్నికలతో పాటుగా,2024 ఏప్రిల్ - మే మాసాల్లో ఎన్నికలు జరగవలసి వుంటుంది. అంటే నిండా రెండేళ్లకు పైగా సమయముంది.

అయితే, రాష్ట్రంలో సుందర ముదనష్టంగా సాగుతున్న వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల ప్రజావ్యతిరేకత దినదిన ప్రవర్త మానంగా పరుగులు తీస్తున్న నేపధ్యంలో ముఖ్యమత్రి జగన్ రెడ్డి అందాక ఆగేలా లేరని, తొందర పడుతున్నారని అంటున్నారు. జగన్ రెడ్డి, ఆలశ్యం అమృతం విషం అనే ఆలోచనలో ఉనారని, ముందస్తు ఎన్నికలకు వెళ్తారని రాజకీయ వర్గాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర మాజీ ముముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ముందస్తు తధ్యమని పార్టీని అందుకు సిద్దం చేస్తున్నారు. 

అదలా ఉంటే, ఏపీకంటే ఎక్కువగా ముందస్తు ఊహాగానాలు వినిపిస్తున్న తెలంగాణలోనూ, ప్రస్తుత అసెంబ్లీ గడవు కొంచెం తక్కువగా ఉన్నా సంవత్సరం పైగానే ఉంది. ప్రస్తుత  అసెంబ్లీ గడువు 16 జనవరి 2024 న ముగుస్తుంది. అంటే 2023 నవంబర్ - డిసెంబర్ మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే సరిపోతుంది. అంటే ఇంచు మించుగా 20 నెలల గడువుంది.  అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన తొలి శాసన సభ గడవు ముగియ కుండానే కాలం చేసింది. లోక్ సభ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కథ అడ్డం తిరుగుతుందని భావించారో ఏమో కానీ, తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సంవత్సరం ముందుగానే, 2018లోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు.ఆ ఎన్నికల్లో గెలిచి రెండవ సారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, అయన మళ్ళీ మరో మారు ముందస్తుకు వెళతారనే ఊహగానాలు మాజోరుగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్’లో అసెంబ్లీ ఎన్నికలు రద్దు చేసి, కర్ణాటక, గుజారాత్ ససన్ సభ ఎన్నికలతో పాటుగా 2023 మార్చి ఏప్రిల్ మాసాల్లో ఎన్నికలకు వెళ్ళాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ ఆలోచన చేస్తునట్లు సమాచారం.  

అయితే ముందస్తు ఎన్నికలు జరుగుతాయా? జరిగితే, ఏపీలో వైసీపీ, తెలంగాణలో తెరాస మళ్ళీ అధికారంలోకి వస్తాయా? అంటే,సమాదానం అటూ ఇటుగా ఉందని పిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఉభయ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న వైసీపీ, తెరాస పార్టీలు ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని అలోచనకు వస్తున్నాయని అంటేనే, సగం ఓటమిని అంగీకరించడం అవుతుందని, మిగిలినసగం విపక్షాల సంసిద్ధత ఫై ఆధార పడి ఉంటుందని  పరిశీలకులు అంటున్నారు. 

నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కారణాలు వేరేయితే కావచ్చును కానీ, రాజకీయ పరిస్థితులు మాత్రం ఒకేలా ఉన్నాయి. అక్కడా, ఇక్కడా కూడా, అధికార పార్టీలు ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నాయి. ఓటమి భయం అధికారపార్టీలను వెంటాడుతోంది. ఆర్థిక పరిస్థితి అద్వాన్న స్థితికి చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. నిజానికి ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలు, పరిపాలనను భారంగా భావిస్తున్నాయి. అందుకే బుజం మార్చుకునే వెసులు బాటు కోసమే ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.అయితే, ముందస్తు ఎన్నికలను వస్తే ఎదుర్కునేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్దంగా ఉన్నయా?  ఢీ అంటే ఢీ అనెందుకు రెఢీ’ గా ఉన్నాయా? ఇప్పుడ ఇదే అందరి ముందున్న మిలియన్ డాలర్ల ప్రశ్న.