ఫలవంతమైన సబ్ కమిటీ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల చర్చలు
Published on: Mon Aug 13, 2012 8:39AM
ఫీజు రీ ఎంబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వానికి కాలేజీ యాజమాన్యాలకు మధ్య జరుగుతున్నా ఫలు దఫాల చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. హైదరాబాద్‌లో మంత్రుల సబ్ కమిటీ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో ఆదివారం చర్చలు జరపడం దాదాపు 600లకు పైగా కళాశాలలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు అంగీకారం తెలపడం జరిగిపోయింది. అయితే కొన్ని కళాశాలలు మాత్రం ఇప్పటికీ ఫీజును మరింతగా పెంచాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది వరకు 31 వేల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ కొనసాగగా ఈ ఏడాది నుంచి అది 35 వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం పట్ల కళాశాలల నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమైనా చివరకు ఈ విషయంలో సింహభాగం కళాశాలలు ఆమోద ముద్ర వేయడంతో ఇంతకాలం వరుసగా వాయిదా పడుతూ వస్తున్న ఇంజనీరింగ్ కౌనె్సలింగ్‌కు మార్గం సుగమమైంది. సోమ, మంగళవారాల్లో కౌనె్సలింగ్ తేదీలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభమవుతాయని కూడా భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఏకీకృత ఫీజుల విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం 35 వేల రూపాయల ఏకీకృత ఫీజును నిర్ణయించడంతో దీనిపై కోర్టును ఆశ్రయించడం సాధ్యంకాదన్న వాదన కూడా లేకపోలేదు. దీనికి తోడు ఇప్పటికే దాదాపు 35 శాతం మంది విద్యార్ధులు ఇతర రాష్ట్రాల ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరిపోయారన్న గణాంకాలతో కళాశాలల యాజమాన్యాలు కూడా మరికొద్దికాలం గడిస్తే కళాశాలల మనుగడ కూడా దెబ్బతింటుందన్న ఆందోళనతో ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించినట్లు కనిపిస్తోంది.


