TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం జ‌గ‌న్‌కు డిప్యూటీ సీఎం ఝ‌ల‌క్.. ఎన్టీఆర్ ఒక్క‌రే యుగ‌పురుషుడు..

Published on: Sat Oct 23, 2021 2:55PM

జ‌గ‌న్‌ను పొగిడితేనే మంత్రి ప‌ద‌వి ఉంటుంది. టీడీపీని నోటికొచ్చిన‌ట్టు తిడితేనే మంత్రి ప‌ద‌వి కొన‌సాగుతుంది. అందుకే, కొంద‌రు మంత్రులు ఇలా బూతుల‌తో రెచ్చిపోతున్నార‌ని అంటున్నారు. రెండున్న‌రేళ్ల గ‌డువు ముంచుకొస్తుండ‌టంతో.. మంత్రిలంద‌రినీ ఒక ర‌క‌మైన టెన్ష‌న్ వేధిస్తోంది. ప‌ద‌వి ఉంటుందో.. ఊడుతుందో తెలీక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కేబినెట్ మొత్తాన్ని మార్చేస్తారంటూ లీకులు వ‌స్తుండ‌టంతో.. ఇక ఎలాగూ ప‌ద‌వి ఉండ‌దు క‌దానీ.. మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెడుతున్నారు ఇంకొంద‌రు. ఇలా, ఏపీ మంత్రులు వ‌రుస‌గా హాట్ హాట్ కామెంట్ల‌తో వైర‌ల్ అవుతున్నారు.

తాజాగా, ప్రస్తుతమున్న మంత్రులు ఎవరు ఉంటారో.. ఎవరికి పదవులు పోతాయో తెలియదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. తాము ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. రెండున్నరేళ్ల‌ తర్వాత, మీరందరూ మంత్రి పదవుల్లో కొనసాగుతారనే గ్యారంటీ లేదని సీఎం జగన్‌ తేల్చి చెప్పారన్నారు. ప‌నిలో ప‌నిగా టీడీపీ గురించీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కమ్మ కుటుంబాలకు ఒరిగిందేమీ లేదని, ప్రత్యేకించి కమ్మ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వ హయాంలోనే లబ్ధి చేకూరిందని చెప్పారు. ఓవైపు సీఎం జ‌గ‌న్‌రెడ్డి మాత్రం ప‌దే ప‌దే చంద్ర‌బాబు-క‌మ్మ కులంకు లింకు పెడుతూ.. టీడీపీ హ‌యాంలో కేవ‌లం క‌మ్మ‌లే బాగుప‌డ్డార‌ని చెబుతుండ‌గా.. డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి మాత్రం చంద్ర‌బాబు పాల‌న‌తో క‌మ్మ‌ల‌కు ఒరిగిందేమీ లేద‌ని చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

ఇక‌, ఎన్టీఆర్‌పై త‌న‌కున్న అభిమానాన్నీ చాటుకున్నారు నారాయ‌ణ‌స్వామి. యుగపురుషుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర అనేది ఉందంటే అది ఎన్టీ రామారావు ఒక్కరేనన్నారు. ఈ స్టేట్‌మెంట్‌ను జాగ్ర‌త్త‌గా విశ్లేషిస్తే.. ఎన్టీఆర్ ఒక్క‌రే ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేశార‌ని.. జ‌గ‌న్‌కు అంత సీన్ లేద‌నేగా అర్థం? జ‌గ‌న్‌రెడ్డి ఎన్టీఆర్ త‌ర‌హాలో ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ, అభిమానం చూర‌గొన‌డం లేద‌నేగా మీనింగ్‌? అంటున్నారు.