TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

క్రికెట్‌కు స్మిత్ గుడ్‌బై

Published on: Thu Mar 2, 2017 11:43AM

వెస్టిండీస్ క్రికెట్‌ జట్టులో టీ20 స్పెషలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న డ్వేన్ స్మిత్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2004లో జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన స్మిత్..అనతికాలంలోనే మంచి బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టెస్టు కెరీర్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన స్మిత్ 24.61 యావరేజ్‌తో 320 పరుగులు చేశాడు. వ్యక్తిగత స్కోరు 105. 105 వన్డేలు ఆడిన స్మిత్ 1560 పరుగులు చేశాడు. హయ్యేస్ట్ స్కోరు 97.

 

అయితే ట్వంటీ ట్వంటీలు ప్రారంభమయ్యాకా స్మిత్‌లో ఉన్న అసలు సిసలు బ్యాట్స్‌మెన్ నిద్రలేచాడు. ఈ ఫార్మాట్‌లో అత్యంత విధ్వంసక ఆటగాళ్లలో ఒకడిగా స్మిత్ పేరు తెచ్చుకున్నాడు. మొత్తం 33 టీ20లు ఆడిన డ్వేన్ 582 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. గత రెండేళ్లుగా జట్టులో స్థానం కోసం ఎదురుచూసిన స్మిత్‌కు ఈసారి కూడా సెలక్టర్‌లు మొండిచేయి చూపడంతో ఇక ఇదే తన రిటైర్‌మెంట్‌కు తగిన సమయమని భావించి గుడ్‌బై చెప్పేశాడు.