ఐపీఎల్-10 నుంచి బ్రావో ఔట్

ఐపీఎల్ అభిమానులకు షాకింగ్ న్యూస్..టీ20 స్పెషలిస్ట్..విండీస్ స్టార్ ప్లేయర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్-10 నుంచి తప్పుకున్నాడు. గుజరాత్ లయన్స్ తరపున ఆడుతున్న బ్రావోను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తోంది..దీంతో ఈ సీజన్‌ నుంచి వైదొలగాలని బ్రావో నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని గుజరాత్ లయన్స్ యజమాని కేశవ్ బన్సల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. గాయం కారణంగా ఈ సీజన్ నుంచి ఓ ఛాంపియన్‌ను మిస్సవుతున్నాం..త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా..అని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు గుజరాత్ లయన్స్ ఏడు మ్యాచ్‌లు ఆడగా బ్రావో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.