TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పట్టాలు పేదలవి - పెత్తనం పెద్దలది

Published on: Mon Feb 20, 2012 2:49PM

ద్వారకా తిరుమలలో రూ.10 కోట్లు విలువచేసే భూములు అన్యాక్రాంతం
ద్వారకా తిరుమల: పూర్వం పేదలకు ప్రభుత్వం పంపిణీచేసిన భూములు ప్రస్తుతం జిరయితి భూములుగా మారాయి. సుమారు రూ.10 కోట్లు విలువచేసే 70 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డులను సైతం మార్చి పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన కొందరు పెద్దలు వాటిని దర్జాగా క్రయ విక్రయాలు సాగిస్తున్నారు. రెవెన్యూశాఖలోని కొందరు అవినీతిపరులు పెద్దలకు సహకరించి ఆ పేదలవద్ద పూర్వం కౌలుకు తీసుకున్న స్థలాలు వారివే అన్నట్లు రికార్డుల్లో సైతం నమోదుచేసి పట్టాదారు పాసు పుస్తకాలు కుడా ఇచ్చేశారు. అసలైన లబ్దిదారులు మాత్రం ఎ రోజుకారోజు కూలీ పనులు చేస్తూ తాము కోల్పోయిన భూములు పొందేందుకు అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం ఈ భూములు పక్కా రిజిష్ట్రేషన్ తో పలు చేతులు మారాయి.ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి రెవెన్యూ భూముల్లో ఈ వ్యవహారం పదేళ్ళుగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. 20  ఏళ్ళుగా ఈ భూములు విలువ గణనీయంగా పెరిగింది. ధర వేలల్లోంచి లక్షల్లోకి మారింది.