లలితాత్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు దుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.