TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ముంబై పేలుళ్లలో పాక్ హస్తం ఉంది....

Published on: Mon Mar 6, 2017 2:19PM

 


26/11 ముంబై పేలుళ్లలో పాక్ హస్తం ఉందని పాకిస్థాన్‌ మాజీ భ‌ద్ర‌తాధికారి మ‌హ‌ముద్ అలీ దురాని వాఖ్యానించారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన 19వ ఆసియా భ‌ద్ర‌తా స‌ద‌స్సులో పాల్గొన్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై పేలుళ్ల కుట్ర పాక్ భూభాగం నుండే జరిగిందని.. అయితే పేలుళ్లకు పాక్ ప్రభుత్వానికి, ఐఎస్ఐ కు సంబంధం లేదని అన్నారు.  దాడికి కుట్ర ప్ర‌ణాళిక‌ కూడా పాక్‌లోనే జ‌రిగింద‌ని... పాకిస్థాన్‌కు చెందిన ఓ గ్రూపు సంస్థ పేలుళ్లకు పాల్పడిందని దురాని స్ఫష్టీకరించారు. కాగా ముంబై పేలుళ్లు జరిగినప్పుడు దురాని ఐఎన్ఐ, పాక్ జాతీయ భద్రతా సలహాదారునిగా దురాని పనిచేశారు.