మహాచండీ అలంకారంలో దుర్గమ్మ!
Published on: Mon Oct 7, 2024 2:21PM

బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.. ఈ రోజు బెజవాడ దుర్గమ్మ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అవతారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వడం ఇదే తొలిసారి. మహా చండీ అమ్మవారిని ప్రార్ధిస్తే సర్వదేవతలను ప్రార్ధించినట్లేనని భక్తుల విశ్వాసం.


