TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దురంధర్ నటి ఆయోషా ఖాన్ అరెస్టు... ఎందుకో తెలుసా?

Published on: Thu Jul 23, 2026 10:27AM

రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా తెరెకెక్కిన ధురంధర్  సినిమాలో నటించిన  నటి, బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ ను ముంబై పోలీసులు  అరెస్టు చేశారు. అయోషాఖాన్ అరెస్టు సినీ, రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.  నీట్ లీకేజీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూ బయటకు వచ్చిన ఆయోషాఖాన్ ను ముంబై పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. 

 నీట్ లీకేజీకి వ్యతిరేకంగానూ, అలాగే  విద్యా వ్యవస్థలో సంస్కరణలను, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత  చేపట్టిన ఆందోళనలకు సంఘీభావం ప్రకటిస్తూ ఆయేషా ఖాన్ బుధవారం (జులై 22) ముంబైలో జరిగిన ర్యాలీ, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

  ముంబై వీధుల్లో విద్యార్థులతో కలిసి  నిరసన తెలుపుతున్న సమయంలో పోలీసులు రంగంలోకి దిగి,  అనుమతి లేకుండా ఆందోళనలు నిర్వహిస్తున్నారంటూ   ఆయేషా ఖాన్‌తో పాటు ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఆయోషా ఖాన్ తాను శాంతియుతంగా ర్యాలీలో పాల్గొన్నాననీ, ఎలాంటి  ఎలాంటి నినాదాలు చేయలేదనీ అన్నారు.  రోడ్డుపై నిలబడటం కూడా నేరమా అని ప్రశ్నించారు. కాగా ఆయోషా ఖాన్ పోలీస్ వ్యాన్, పోలీస్ స్టేషన్ నుంచి తీసిన వీడియోలను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. నిష్కారణంగా తనను ముంబై పోలీసులు అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Durandhar actress Ayesha Khan arrested, Mumbay, Police, CJP, Prtests, Solidarity