TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మన ‘కితకితలు’ కొట్టేశారు గురో...

Published on: Mon Feb 9, 2015 8:46AM

 

మన ఇ.వి.వి. సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన ‘కితకితలు’ సినిమాని బాలీవుడ్‌ వాళ్ళు కొట్టేశారు. ‘కితకతలు’ సినిమానే కాస్త మార్చి హిందీలో ‘దమ్ లగాకే హైస్సా’ అనే పేరుతో సినిమా తీసేశారు. ‘విక్కీ డోనర్’ హీరో ఆయుష్మాన్ ఖురానా, మరాఠీ నటి భూమి పెడ్నేకర్ హీరో హీరోయిన్లుగా నటించారు. సన్నగా నాజూగ్గా వుండే అందగత్తెని పెళ్ళి చేసుకున్న హీరో అనుకోని పరిస్థితుల్లో లావుగా అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం, ఆమెతో కాపురం చేయకుండా ఈసడించుకుంటూ వుండటం... ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా ఇస్టోరీ. ఈ సినిమా ట్రైలర్ ఈమధ్యే విడుదలైంది. ట్రైలర్ని చూస్తుంటే మన ‘కితకితలు’ సినిమాతోపాటు ‘పెళ్ళైన కొత్తలో’ సినిమాని కూడాకలిపి కొట్టేశారని అనిపిస్తోంది.