TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

Published on: Tue Sep 29, 2020 1:52PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది.

 

అక్టోబర్ 9న దుబ్బాక ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబరు 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబరు 17న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చివరి తేదీ అక్టోబరు 19. పోలింగ్ నవంబరు 3న నిర్వహిస్తారు. నవంబరు 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

 

దుబ్బాకతో పాటు దేశ వ్యాప్తంగా 56 అసెంబ్లీ స్థానాలకు, బీహార్ లోని ఒక లోక్ సభ స్థానానికి ఉపఎన్నికల షెడ్యూల్ ఈరోజే విడుదల అయ్యింది.  అయితే.. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు మాత్రం ఇంకా తేదీ ప్రకటించలేదు. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. నేటి నుంచి దుబ్బాకలో కోడ్ అమలు కానుంది.

 

ఇదిలా ఉంటే.. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ ఉప ఎన్నికకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే ప్రచారం షురూ చేశాయి. మరి దుబ్బాకలో మళ్లీ గులాబీ జెండానే ఎగురుతుందో లేక కాంగ్రెస్, బీజేపీలలో ఏదైనా పార్టీ గెలిచి అధికార పార్టీకి షాక్ ఇస్తుందో చూడాలి.