TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు..

Published on: Tue Mar 7, 2017 3:03PM


ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు పడింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై గడ్చిరోలి జిల్లా కోర్టు సాయిబాబాకు జీవిత ఖైదు విధించింది. సాయిబాబా సహా మరో ఆరుగురికి కూడా కోర్టు జైలు శిక్ష విధించింది. కాగా ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబాను మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై గడ్చిరోలి పోలీసులు 2014లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.