'విశ్వరూపం' డీటీహెచ్ విడుదల తేదీ ఫిబ్రవరి 2
Published on: Tue Jan 15, 2013 11:25AM

విశ్వరూపం’ సినిమాను నేరుగా డీటీహెచ్ తో పాటే థియేటర్ల విడుదల చేస్తానని ప్రకటించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ థియేటర్ యాజమాన్యాల సంఘంతో జరిగిన పోటీలో ఓడిపోయాడు. అనేక వివాదాలు, మలుపులు తిరిగిన ఈ వ్యవహారం ఆఖరుకు థియేటర్లో సినిమా విడుదలయిన వారం రోజులకు విడుదల చేయాలన్న ఒప్పందంతో ముగిసింది. ఈ ప్రకారం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 25న విడుదలవుతుంది. వచ్చేనెల 2న డీటీహెచ్ లలో ప్రసారమవుతుంది. హిందీలో ఫిబ్రవరి 1న విడుదలవుతుంది. ఫిబ్రవరి 2న అన్నిభాషల్లో డీటీహెచ్ లో విడుదలవుతుంది. రెండూ ఒకేసారి విడుదల చేయాలన్న కమల్ హాసన్ నిర్ణయాన్ని ముప్పుతిప్పలు పెట్టి థియేటర్ యాజమాన్యాలు మార్చుకునేలా చేశాయి.


