TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డిఎస్ సినోటిఫికేషన్ తప్పులు - అయోమయంలో అభ్యర్ధులు

Published on: Thu Feb 16, 2012 4:36PM

హైదరాబాద్:డిఎస్ సి 2012 నోటిఫికేషన్ తప్పుల తడకగా ఉంది. ఎంపిక చేసిన పాఠ్యంశాల్లో దొర్లిన పొరబాట్లు అభ్యర్ధులను అయోమయానికి గురిచేస్తున్నాయి. బికామ్ ఉత్తీర్ణులకైతే తామసలు అర్హులనూ, కాదా అన్న సందేహం కలుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన డిఎస్ సి నియామకాల్లో బికామ్ ఉత్తీర్ణులు ఎస్ జిటి పోస్టులకు మాత్రమే అర్హులు. అయితే డిఎస్ సి 2012లో స్కూలు అసిస్టెంట్ పోస్టులకు కూడా వీరు అర్హులేనంటూ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బికామ్ ఉత్తీర్ణుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. అయితే వారి ఆనందం అట్టేకాలం నిలువలేదు. డిఎస్ సి నోటిఫికేషన్ లో పొందుపరిచిన సబ్జెక్టులకు బికామ్ లోని   పాఠ్యంశాలకు పొంతన లేకపోవడంతో వారు గందరగోళంలో పడ్డారు.
   

 

అలాగే బిఎస్పీ లో బోటనీ, సీడ్ టెక్నాలజి, కెమిస్ట్రీతో డిగ్రీ చేసిన అభ్యర్ధులు కూడా ఈ నోటిఫికేషన్ల వల్ల నష్టపోయి ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ఈ కోర్సులను పలు కారణాల వల్ల ఎత్తివేసింది. కోర్సు నిర్వహించిన 1996-2000 సంవత్సరాల మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2000 మంది ఈ కోర్సును అభ్యసించారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో బయాలజికల్ సైన్స్, ఇంగ్లీషులో డిగ్రీ చేసిన ఈ అభ్యర్ధులను స్కూలు అసిస్టెంట్లకు అవకాశం ఇవ్వకపోయినా ఎన్ జిటిలకు అవకాశం కల్పించిన ప్రభుత్వ తాజాగా ప్రకటించిన డిఎస్ సి 2012లో పూర్తిగా విస్మరించింది.