TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘దృశ్యం’ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ!

Published on: Fri Jul 11, 2014 11:48AM

 

వెంకటేష్, మీనా, నదియా, నరేశ్, రవి కాలే, కృతిక, బేబి ఎస్తేర్ నటించిన ‘దృశ్యం’ సినిమా శుక్రవారం విడుదలైంది. డి.సురేష్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి నిర్మించిన ఈ సినిమాకి నటి శ్రీప్రియ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. ‘దృశ్యం’ సినిమా సస్పెన్స్, థ్రిలర్, ఫ్యామిలీ డ్రామాల మేళవింపుగా రూపొందిన సినిమా. పోలీస్ ఆఫీసర్లయిన నదియా, నరేష్‌ల కుమారుడు వరుణ్ కనిపించకుండా పోతాడు. దాంతో పోలీసులకి ఒక చిన్న పల్లెటూరిలో కేబుల్ ఆపరేటర్‌గా వున్న రాంబాబు (వెంకటేష్) అనే కుటుంబం మీద అనుమానం కలుగుతుంది. భార్యా, భర్త, ఇద్దరు ఆడపిల్లలతో సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబంలోకి పోలీసులు ప్రవేశిస్తారు. ఆ కుటుంబానికి వరుణ్ కనిపించకుండా పోవడానికి సంబంధమేంటి? ఆ కుటుంబాన్నే ఎందుకు అనుమానించారు? పోలీసుల విచారణ నుంచి రాంబాబు కుటుంబం తప్పించుకుందా? ఈ కుటుంబమే వరుణ్‌ని కిడ్నాప్ చేసిందా? అసలేం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘దృశ్యం’ సినిమా చూడాల్సిందే! కేబుల్ ఆపరేటర్ రాంబాబుగా వెంకటేష్ విభిన్నమైన పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన కొన్ని సన్నివేశాలలో చక్కటి ఎమోషన్స్ పలికించారు. చాలాకాలం తర్వాత మీనాకి మరో మంచి పాత్ర దొరికింది. వెంకటేష్ కుమార్తెలుగా నటించిన కృతిక, బేబీ ఎస్తేర్ ప్రశంసనీయమైన నటన ప్రదర్శించారు. నదియా, నరేష్ జంట కూడా బాగుంది. వెంకటేష్ కుటుంబాన్ని వేధించే కానిస్టేబుల్‌గా నటించిన రవి కాలే ఆకట్టుకున్నారు. ప్రేక్షకులకు చక్కని అనుభూతి కలిగేవిధంగా శ్రీప్రియ ‘దృశ్యం’ చిత్రాన్ని మలిచారు. దర్శకురాలిగా మంచి మార్కులు పొందారు.