ఫుల్లుగా మందుకొట్టి యాక్సిడెంట్ చేసిన యువతి
Published on: Wed Sep 17, 2014 9:36AM

మందుకొట్టి యాక్సిడెంట్లు చేయడం ఒక్క మగాళ్ళ హక్కు మాత్రమే కాదు.. లేడీస్ కూడా ఈ రంగంలో తమ హక్కును నిరూపించుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఓ యువతి మంగళవారం రాత్రి తప్పతాగి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ మెహిదీపట్నం ప్రాంతంలోని ఫ్లై ఓవర్ మీద నుంచి వెళ్తూ ఓ ద్విచక్ర వాహనాన్ని తన కారుతో ఢీకొట్టింది. ఆ తర్వాత ఫ్లై ఓవర్ మీద వున్న డివైడర్ని ఢీకొట్టింది. తర్వాత కారు దిగి తూగుతూ జోగుతూ నానా హడావిడి చేసింది. ఇదెక్కడి చోద్యమమ్మా అని అక్కడున్నవారు అడిగితే నన్ను అడగటానికి మీరెవరంటూ తిరగబడింది. ఈలోగా పోలీసులు వచ్చి ఆమెను బ్రీత్ అనలైజర్‌తో పరీక్షిస్తే మేడమ్ గారు పీకలదాకా మందు కొట్టిన విషయం నిరూపణ అయింది. దాంతో పోలీసులు ఆమె మీక కేసు నమోదు చేశారు. గతంలో కూడా రెండు మూడు సందర్భాలలో ఈమెగారే ఇలా తప్పతాగి యాక్సిడెంట్లు చేసిన చరిత్ర కూడా వుందని తెలిసింది. ఈమె డ్రైవింగ్ లైసెన్స్‌ని రద్దు చేసే పనిలో పోలీసులు వున్నట్టు సమాచారం. ఈ యువతి అబిడ్స్‌లోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయట.


