తప్పతాగి అడ్డొచ్చిన పోలీసుని చితకబాదిన మహిళ

 

ఆడవారు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. మరి తప్పతాగడంలో ఎందుకు వెనక పడాలి అనుకుందో ఏమో కానీ ఒక మహిళ తప్ప తాగి భర్తతో కలిసి రోడ్డెక్కింది. తాగిన మైకంలో ఉన్న ఆ మహిళ, ఆమె భర్త నడిరోడ్డు మీద వీరంగం వేశారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తుండటంతో స్కూటీ మీద వెళుతున్న వీరిని ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయి స్కూటీని ఆపిన ట్రాఫిక్‌ పోలీసులపై చిందులు తొక్కారు. స్కూటీ మీద వెనుక కూర్చున్న మహిళ తమను వెళ్లనివ్వాలని గట్టిగా కేకలు వేస్తూ ట్రాఫిక్‌ పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించారు. 

స్కూటీ తాళం చెవిని తీసుకున్న ట్రాఫిక్‌ పోలీసును కొట్టి అతని నుంచి తాళం చెవిని లాక్కుంది. పశ్చిమ ఢిల్లీలోని మాయాపురిలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో స్కూటీ మీద ఉన్న ఇద్దరూ తప్పతాగి ఉన్నారని, ట్రాఫిక్‌ పోలీసులతో అసభ్యంగా దురుసుగా ప్రవర్తించినందుకు వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో స్కూటీని నడుపుతున్న వ్యక్తిని అనిల్‌ పాండే, ఆయన వెనుక కూర్చున్న మహిళను ఆయన భార్య మాధురిగా గుర్తించి వారిని అరెస్టు చేశారు.