TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిద్దిపేటలో డ్రగ్స్ స్వాధీనం

Published on: Mon May 18, 2026 12:29PM

సిద్దిపేటలో నార్కోటిక్స్ అధికారుల దాడిలో భారీగా  డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ దాడిలో 39.270 కిలోల ఆల్ఫాజోలాం స్వాధీనం చేసుకున్న సంఘటన కలకలం రేపింది. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ   రూ. కోట్లు ఉంటుందని సమాచారం.  సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్‌లోని కలకుంట కాలనీ సమీపంలో నిందితులు డ్రగ్స్‌ను ఒక వాహనం నుంచి మరో వాహనానికి మారుస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకు న్నారు.

ఈ ఆపరేషన్‌లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి39.270 కిలోల ఆల్ఫాజోలాంతో పాటు రూ.85.36 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకు న్నారు.ప్రాథమిక విచారణలో ఈ ఇద్దరూ ఆల్ఫాజోలాం తయారీతో పాటు సరఫరా నెట్‌వర్క్‌ను నడుపుతు న్నట్లు బయటపడింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.డ్రగ్స్ సరఫరా గొలుసును పూర్తిగా ఛేదించేందుకు మరింత విచారణ కొనసాగుతోందని నార్కో టిక్స్ అధికారులు తెలిపారు.