Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్నేహితుడి బర్త్డే పార్టీ పేరుతో డ్రగ్స్ పార్టీ.. ఆరుగురు ఐటీ ఉద్యోగులు అరెస్టు
posted on: Aug 3, 2025 10:34PM
.webp)
ఐటీ ఉద్యోగులకు వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు.. చిల్ అయిపో తుంటారు. పబ్ లు పార్టీలతో ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు షాపింగ్ ల పేరుతో డబ్బులు ఖర్చు పెడుతుంటే.. మరికొందరు మద్యం మత్తులో తూగిపోతుంటారు. ఇంకొందరు అయితే డ్రగ్స్ తీసుకొని రెండు రోజులపాటు మత్తులో తేలియా డుతూ ఉంటారు. మళ్లీ సోమవారం నుంచి శుక్రవారం వరకు పనుల్లో బిజీ అయిపోతారు. అయితే వీరందరూ వీక్ ఎండ్ పార్టీ కోసం ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న రిసార్టులు, ఫామ్ హౌస్ లలో వీకెండ్ పార్టీలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ వీకెండ్ పార్టీల పైన ఎక్సైజ్, పోలీస్ అధికారులు నజర్ పెట్టారు.
ఈ నేపథ్యంలోనే మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో ఆరు గురు ఐటి ఉద్యో గులు కలిసి ఏర్పాటు చేసుకున్న వీకెండ్ పార్టీపై పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్ లో ఆ వీకెండ్ పార్టీలో డ్రగ్స్ డ్రగ్స్ తీసు కుంటూ చిల్ అవుతున్న ఆరుగురు ఐటి ఉద్యోగులను ఎక్స్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేసారు. స్నేహితుడి బర్త్ డే పార్టీ పేరుతో వీరు ఈ వీకెండ్ పార్టీ జరుపుకుంటున్నారు. ఏల్ఎస్ డి బ్లాట్స్, హష్ అయిల్, మద్యం తో పార్టీ చేసుకుం టున్నారు. విశ్వసనీయ సమచారం మేరకు ఎక్స్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు మొయినాబాద్ లోని ఫామ్ హౌజ్ పై సోదాలు జరిపి ఆరుగురిని అరెస్టు చేశారు. అలాగే డ్రగ్స్, మూడు ఖరీదైన లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకు వచ్చినట్లు విచారణలో ఉద్యోగులు వెల్లడించారు.. మరో ఇద్దరు ఐటీ ఉద్యోగులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.


.webp)
.webp)


