మొయినాబాద్ లో డ్రగ్స్ పార్టీ.. 50 మంది అరెస్టు
Published on: Mon Oct 6, 2025 9:27AM
.webp)
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని పెద్దమంగళం లో ఓ ఫామ్ హౌస్ పై పోలీసులు ఆదివారం (అక్టోబర్ 5) రాత్రి పోలీసులు దాడి చేసి దాదాపు 50 మంది యువతీయువకులను అదుపు చేసుకుంటున్నారు. ఆ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఓఎస్టీ పోలీసులు ఈ దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా అరెస్టైన వారిలో పన్నెండు మంది అమ్మాయిలు, 38 మంది అబ్యాయిలు ఉన్నారు. వీరిలో అత్యధికులు మైనర్లే కావడం విశేషం.
ఆ ఫామ్ హౌస్ యజమాని ఒక్కొక్కరి నుంచి 13 వందల రూపాయలు ఎంట్రీఫీజుగా వసూలు చేసి ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల దాడిలో పెద్ద ఎత్తున మద్యం, గంజాయి పట్టుబడినట్లు చెబుతున్నారు. అలాగే యువత గంజాయి సేవించినట్లు టెస్టుల్లో తేలింది. అరెస్టు చేసిన యువతీ యువకులను మొయినాబాద్ పీఎస్ కు తరలించారు. అలాగే పామ్ హౌస్ యజమానికి కూడా అదుపులోనికి తీసుకున్నారు.


