డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మంచో హతం.. మెక్సికోలో ఉద్రిక్తత

posted on: Feb 23, 2026 8:54AM

ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన డ్రగ్  మాఫియా డాన్ లలో  ఒకడైన ఎల్ మెంచో   మెక్సికో సైన్యం చేపట్టిన భారీ ఆపరేషన్‌లో  హతమయ్యాడు. ఈ విషయాన్ని మెక్సికో రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించింది.  ఈ వార్త తెలియగానే ఎల్ మెంచో నాయకత్వం వహిస్తున్న జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (సీఎన్జీ) సభ్యులు జాలిస్కో, గ్వాడలజారా వంటి ప్రధాన నగరాల్లో విధ్వంసానికి తెగబడ్డారు. హైవేలపై వాహనాలకు నిప్పుపెట్టారు. రోడ్లను దిగ్బంధిచారు. దీంతో అధికారులు  కోడ్ రెడ్  ప్రకటించారు.  ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.  

అమెరికాలోకి భారీగా డ్రగ్స్  సరఫరా చేస్తున్న ఎల్ మెంచో అగ్రరాజ్యానికి పెద్ద తలనొప్పిగా మారాడు. అందుకే, అతడి ఆచూకీ తెలిపిన వారికి అమెరికా ప్రభుత్వం 15 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో  రూ. 125 కోట్లు) భారీ రివార్డును ప్రకటించింది. కాగా ఎన్ మెంచో హతమైన నేపథ్యంలో మెక్సికోలో పరిస్థితులు ఆద్రిక్తంగా మారాయి. దీంతో అమెరికా, కెనడా ప్రభుత్వాలు మెక్సికోలో నివసిస్తున్న తమతమ దేశాల పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేశాయి.  సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించాయి. ఎయిర్ కెనడా వంటి సంస్థలు తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...