TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డ్రగ్స్ డీల్ భగ్నం.. పోలీసులపైకి కారును దూసుకెళ్లించిన యువకుడు..!

Published on: Mon Jul 27, 2026 9:14AM

 

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా నిర్వహిస్తున్న పోలీసులపై ఓ యువకుడు కారుతోనే దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. డ్రగ్స్ డీల్‌ను భగ్నం చేసిన పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నిందితుడు కారు రివర్స్‌లో వేగంగా నడిపి ఓ కానిస్టేబుల్ కాలుపై నుంచి దూసుకెళ్లాడు. అనంతరం నగర రహద రులపై కొంత దూరం వరకు ఛేజ్ ఆసక్తికరంగా సాగింది. చిట్ట చివరకు పోలీసులు అఫ్జల్‌గంజ్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు కాలు ఫ్రాక్చర్ కాగా, హెచ్-న్యూ ఇన్‌స్పెక్టర్‌తో పాటు మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.

 వివరాల్లోకి వెళితే.. ! 

హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌కు అబిడ్స్ ప్రాంతంలో డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు జరుగుతున్నట్లు విశ్వస నీయమైన సమాచారం అందింది. దీంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.. హెచ్-న్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందంతో కలిసి అబిడ్స్ ప్రాంతంలో మాటు వేసి నిఘా చేపట్టారు.
కొద్దిసేపటికే నీలం రంగు బలెనో కారు అబిడ్స్‌లోని పాయల్ ఫుట్‌వేర్ సమీపానికి చేరుకుంది. కారులో ఉన్న వ్యక్తికి బయట నుంచి వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పద ప్యాకెట్ అందజేయడాన్ని పోలీసులు గమనించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్యాకెట్ అందిం చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం కారులో ఉన్న హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన సైఫ్‌కు పోలీసులు తమ గుర్తింపు కార్డులు చూపించి వాహనం నుంచి దిగాలని సూచించారు. మొదట సహకరిస్తున్నట్లు నటిస్తూ సైఫ్.. ఒక్కసారిగా కారు రివర్స్ గేర్‌లో వేగం గా నడిపాడు. అధిగమనించిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో రెచ్చిపోయిన సైఫ్ కారు ఆపకుండా కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలుపై నుంచి దూసుకెళ్ల డంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.అయినా నిందితుడు ఆగకుండా అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశాడు. వెంటనే హెచ్-న్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌తో పాటు ఇతర సిబ్బంది కారును వెంబడిం చారు. నగర వీధుల్లో కొంతసేపు ఉత్కంఠభరితంగా సాగిన ఛేజ్ అనంతరం పోలీసులు చివరకు అఫ్జల్‌ గంజ్ వద్ద కారును అడ్డ గించి సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కారు కాలుపై నుంచి వెళ్లడంతో కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలు విరిగింది. ఆయనను వెంటనే సోమాజిగూడ లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అంది స్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ ఫిర్యాదు మేరకు నిందితుడు సైఫ్‌పై అబిడ్స్, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హెచ్-న్యూ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ నెట్‌వర్క్‌తో అతనికి ఉన్న సంబంధాలు, ప్యాకెట్‌లోని మాదకద్రవ్యాల గురించి, సరఫరాదారుల వివరాలపై లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.

Drug deal busted, Constable Mahender Yadav, Abids, Hussaini Alam,  CP Sajjanar, Hyderabad police, DCP C.V. Anand