TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అనుమానాస్పద స్థితితో వైసీపీ ఎమ్మెల్సీ  మాజీ కారు డ్రైవర్ మృతి

Published on: Fri May 20, 2022 10:35AM

వైసీపీ ఎమ్మెల్సీ వద్ద గతంలో కారు డ్రైవర్ గా పని చేసిన సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు వద్ద కారు డ్రైవర్ గా పని చేసిన సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో మరణించాడంటూ అతడి మృతదేహాన్ని తన కారులో  బంధువల వద్దకు తీసుకువచ్చారు. అయితే బంధువులు మాత్రం సుబ్రహ్మణ్యం మృతి యాక్సిడెంట్లో కాదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీని వారు నిలదీయడంతో మృతదేహాన్ని కారులోనే వదిలేసి అనంతబాబు  అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఎమ్మెల్సీ అనంతబాబే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని కారులోనే ఉంచి వారు నిరసనకు దిగారు. సుబ్రహ్మణ్యం మరణానికి ఎమ్మెల్సీ అనంతబాబే బాధ్యుడని వారు ఆరోపిస్తున్నారు.

సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపేసి రోడ్డు ప్రమాదంలో మరణించాడంటూ కథలు అల్లుతున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. సుబ్రహ్మణ్యం మృతికి కారకుడైన ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.