TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జలకళతో శ్రీశైలం కళకళ.. ఎనిమిది గేట్లు ఎత్తి నీటి విడుదల

Published on: Wed Jul 30, 2025 12:53PM

 శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ఉథృతి కొనసాగుతుండటంతో   శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఆ సుందర జలదృశ్యాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో పర్యటకులు వస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జునసాగర్ వైపు నురుగులు కక్కుతూ పరుగుల తీస్తున్నది.

ఇక శ్రీశైలం జలశయం నుంచి రెండు లక్షల 16 వేల 520 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా జూరాల నుంచి లక్షా 43 వేల 999 క్యూసెక్కుల వరదనీరు, సుంకేసుల నుంచి  1 లక్ష 22 వేల 326 క్యూసెక్కుల  వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.    శ్రీశైలం జలాశయానికి    ఇన్ ఫ్లోగా 2 లక్షల 66 వేల 325 క్యూసెక్కులు  ఉండగా అవుట్ ఫ్లో 2 లక్షల 82 వేల 478 క్యూసెక్కులుగా ఉంది.   శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగులగా ఉంది పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.4290 టీఎంసీలుగా నమోదైంది  శ్రీశైలం కుడి ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది.