TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెక్రటేరియట్ ఎదుట తాగుబోతు సన్నాసి కేసీఆర్ విగ్రహమా?!

Published on: Tue Aug 20, 2024 1:17PM

తెలంగాణ హాట్ హాట్ రాజకీయాలు కేసీఆర్ విగ్రహం పెట్టేవరకు వచ్చాయి. సాధారణంగా ఎవరైనా చనిపోయాక విగ్రహాలు పెడతారు. కేసీఆర్ ఇంకా బతికే వున్నారు. ఆయన చనిపోయిన తర్వాత విగ్రహం ఎక్కడ పెట్టాలా అని ఆయన కుమారుడు కేటీఆర్ ఆలోచిస్తున్నట్టు వుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. తాగుబోతోడు అయిన కేసీఆర్ విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు పెట్టడానికి తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే, మళ్ళీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ నుంచి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేసి, ఆ ప్రదేశంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని కేటీఆర్ ప్రకటించారు. పదేళ్ళు అధికారం వెలగబెట్టిన కేసీఆర్ కుటుంబానికి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడానికి చేతులు రాలేదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతాం అని ముఖ్యమంత్రి ప్రకటించేసరికి వీళ్ళకి అర్జెంటుగా తెలంగాణ తల్లి గుర్తుకొచ్చింది. రేవంత్ రెడ్డి తక్కువాడేమీ కాదు కదా..  రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తానన్న కేటీఆర్‌కి ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెట్టారు. 

భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ జయంతిని కాంగ్రెస్ నేతలు మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. సోమాజిగూడలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. పీసీసీ మాజీ చీఫ్ వీహెచ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ ఇన్‌చార్జి మున్షీ, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను నేతలు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ కామెంట్లకు సరైన సమాధానం ఇచ్చారు. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘ఎవడికైనా చేతనైతే రాజీవ్ గాంధీ విగ్రహం ముట్టుకోండి. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముడితే చెప్పు తెగే దాకా కొడతాం. రాజీవ్ విగ్రహం ఎవరు ముడతారో, ఎప్పుడు ముడతారో చెపితే మా నాయకుడు జాగ్గారెడ్డిని పంపిస్తాం. తాగుబోతులు, దొంగల విగ్రహాలకు సచివాలయం ఎదుట స్థానం లేదు. చాలా త్వరగానే రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. పండగ వాతావరణంలో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతామంటే తొలగిస్తామని కొందరు సన్నాసులు అంటున్నారు. ఆ సన్నాసులకి అధికారం పోయినా బలుపు తగ్గలేదు. ఆ కుటుంబం బలుపును తగ్గించే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు. రాజీవ్ గాంధీ విగ్రహం వున్న స్థానంలో వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకోవాలని కేటీఆర్ అనుకుంటున్నాడు. వాళ్ల అయ్య పోయేదెప్పుడు? విగ్రహాన్ని పెట్టేదెప్పుడు. ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొన్నారు. తాగుబోతు సన్నాసి కేసీఆర్ విగ్రహం సెక్రటేరియట్ ముందు పెడుతారా?. తెలంగాణను దోచుకున్న దొంగ విగ్రహం పెట్టాలా? అసంభవం. నిద్ర లేచిన దగ్గర్నించి తాగుతూనే వుండే పచ్చి తాగుబోతోడి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు పెడతారా? నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా?. అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడు... కేసీఆర్ కుటుంబం ఇక అధికారంలోకి వచ్చేది కలే. ఇక కేసీఆర్ కుటుంబం చింతమడకకే పరిమితం. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది. మా చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించనవసరం లేదు. విచక్షణ కోల్పోయి అర్థంపర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుంది.. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతాం. దేశ యువతకి రాజీవ్ గాంధీ స్ఫూర్తి. విప్లవాత్మకమైన చైతన్యానికి కారణం రాజీవ్ గాంధీ. ఇండియా ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించింది రాజీవ్ గాంధీ. టెక్నాలజీ మాత్రమే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి రాజీవ్ గాంధీ. మహిళలకు ప్రాధాన్యం ఉండాలని మహిళా సాధికారతకు అడుగులు వేసినవారు రాజీవ్ గాంధీ. దేశ సమగ్రత కోసం రాజీవ్ ప్రాణత్యాగం చేశారు.’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.