అమెరికాలో దారుణం.. తల్లీకుమారుడి హత్య
Published on: Fri Mar 24, 2017 10:39AM

అమెరికాలో జాత్యహంకార దాడుల నేపథ్యంలో పలువురు భారతీయులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉన్మాది కాల్పులలో తెలుగు ఇంజినీర్ కూచిబొట్ల శ్రీనివాస్ మరణించాడు. ఇంకా ఆ ఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. అమెరికాలో ఇద్దరు తెలుగువారు దారుణ హత్య కలకలం రేపుతోంది. న్యూజెర్సీలో నర్రా హనుమంతురావు భార్య, ఏడేళ్ల కొడుకును దుండగులు హత్య చేశారు. నర్రా హనుమంతరావు విధులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు ఆయన సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు.. తల్లీకొడుకును గొంతు కోసి ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. నర్రా హనుమంతరావుది ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం. అయితే గత 12 ఏళ్లక్రితం అమెరికాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. మరోవైపు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అమెరికాలోని తానా ప్రతినిధులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు.


