TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి డోప్ టెస్ట్ తప్పనిసరి.. సీఎం ఆదేశం

Published on: Thu Jul 5, 2018 2:49PM

 

డ్రగ్స్.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి.. డ్రగ్స్ మత్తులో పడి ఎందరో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.. ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి పెట్టి చర్యలకు సిద్ధమవుతున్నాయి.. మాములుగా స్పోర్ట్స్ లో ప్లేయర్స్ కి డోప్ టెస్ట్ నిర్వహించడం.. వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే వారి మీద చర్యలు తీసుకోవడం అప్పుడప్పుడు చూస్తుంటాం.. కానీ తాజాగా పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి డోప్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. పంజాబ్ లో డ్రగ్స్ వినియోగం బాగా పెరగటమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తుంది.. ఇక నుండి పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగుల ఎంపిక మరియు ప్రమోషన్స్ సమయంలో కచ్చితంగా డోప్ టెస్ట్ నిర్వహించనుంది.. ఇది పోలీస్ శాఖకు కూడా వర్తిస్తుంది.. మొత్తానికి పంజాబ్ సీఎం డ్రగ్స్ ని అరికట్టంలో భాగంగా ఒక అడుగు ముందుకేశారు.