Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గాడిదల రేస్...ఓ రేంజ్ లో ఉందిగా!
posted on: Apr 23, 2022 1:01PM
రాయలసీమలో గాడిదల పందేలు ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. స్థానికంగా ఈ పందేలకు గుర్రప్పందాలకు మించిన క్రేజ్ లభిస్తున్నది. పండుగుల సమయాలలో కోళ్ల ఫైట్ కు ఒక సంప్రదాయ క్రీడగా ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విపరీతమైన ఆదరణ ఉంది. ఇక గుర్రప్పందాల సంగతి చెప్పుకోనవసరం లేదు. భారీ రేంజ్ లో జరిగే ఈ గుర్రప్పందాలలో కోట్ల రూపాయలు చేతులు మారుతుంటుంది. ఈ పోటీలలో పాల్గొనే గుర్రాలకూ, వాటిని దౌడుతీయించే జాకీలకు శిక్షణ కోసమే కోట్లాది రూపాయలు వ్యయమౌతుంది.
అయితే కర్నూలు జిల్లాలో ఇటీవల ఆదరణ సంతరించుకుంటున్న గాడిద రేస్ రేంజ్ ఓ స్థాయిలో ఉంది. అచ్చం గుర్రాలకు వేసినట్లే జీనులు వేసి కళ్లేలను పట్టుకుని రోడ్డు మీద గాడిదలను దౌడు తీయిస్తుంటే...ఆ సీన్ చూసి తీరాల్సిందే అన్నట్లు ఉంది. ఈ రేసుకు మద్దతుగా వెనుక పెద్ద సంఖ్యలో జనం ద్విచక్ర వాహనాల మీద ఫాలో అయ్యారు. ఇటీవలే కర్నూలు జిల్లాలో మొదలైన ఈ డాంకీ రేస్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
దీంతో కేవలంపందేల కోసమే గాడిదలను కొనుగోలు చేయడం, శిక్షణ ఇవ్వడం చేస్తున్నారు. పేదోళ్ల హార్స్ రేస్ గా దీనిని అభివర్ణిస్తున్నారు. తూర్పు, పశ్చిమలలో కోడి పందేలలా కర్నూలు జిల్లాలో ఇక నుంచి పండుగలకు గాడిద రేస్ లు నిర్వహించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముందు ముందు డాంకీ రేస్ భారీగా సొమ్ములు చేతులు మారే జూదం స్థాయికి చేరిపోయినా ఆశ్చర్యం లేదు.


.webp)
.webp)


