TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీటీడీ ట్రస్టులకు 10 రోజుల్లో 30 కోట్ల విరాళాలు

Published on: Sat Mar 29, 2025 5:16PM

గత పది రోజులలో తిరుమలేశునికి దాదాపు 30 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో దాతలు సమర్పించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న పది ట్రస్టులకు గత పది రోజుల్లో భారీ విరాళాలు అందాయి. వాటిలో శ్రీవేంకటేశ్వర ఆలయ  నిర్మాణం ట్రస్ట్ కు 11 కోట్ల 67 లక్షల 15 వేల 870 రూపాయలను దాతలు విరాళంగా ఇచ్చారు.

అలాగే అన్నప్రసాదం ట్రస్ట్ కు గత పది రోజులలో దాతలు 8 కోట్ల 14 లక్షల 90 వేల958 రాపాయలు విరాళంగా అందాయి.  ఇక శ్రీ బాలాజీ ఆరోగ్య ప్రసాదిని ట్రస్ట్ కు 4 కోట్ల 88 లక్షల 50 వేల 391రూపాయలు,  శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ కు రూ. 1,15,83,653లు దాతల నుంచి విరాళంగా అందాయి. అదే విధంగా శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు రూ 1,14,36,016లు.  శ్రీ వెంకటేశ్వర విద్యా దాన ట్రస్ట్ కు రూ.1,65,85,417లు బర్డ్ ఆసుపత్రి ట్రస్ట్ కు రూ. 54,92,050లు విరాళంగా అందాయి.

ఇక  శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయస్సు ట్రస్ట్ కు రూ. 37,48,526లు, శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు రూ, 29,60,968లు స్విమ్స్ ఆసుపత్రి ట్రస్ట్ కు రూ. 2,05,326లను దాతలు విరాళంగా ఇచ్చారు. అదే విధంగా శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ట్రస్ట్ కు కూడా విరాళాలు అందాయి. మొత్తం పది ట్రస్టులకు కలిపి పది రోజుల వ్యవధిలో 29 కోట్ల, 90 లక్షల, 71 వేల 331రూపాయలు విరాళాల రూపంలో జమ అయ్యాయి.