పాక్ పీఎంతో కలిసి మన పీఎం మోడీని కార్నర్ చేసిన ట్రంప్ !

 

ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా నుంచి అందే భారీ సాయం ఆగిపోవడం మరో వైపు సాయానికి చైనా కూడా మీనా మేషాలు లెక్కించడంతో సాయం అడిగేందుకు ఇమ్రాన్ ఖాన్ ట్రంప్‌ను కలవడానికి వెళ్లాడు. ప్రమాణ స్వీకారం మొదలు పొదుపు నినాదాన్ని ఎత్తుకున్న ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక విమానంలో కాకుండా సాధారణ పౌరుడిగే అమెరికా వెళ్లాడు. 

హోటళ్ళలో ఉంటే ప్రభుత్వ డబ్బులు ఖర్చవుతాయని పాక్ రాయబారి నివాసంలోనే బస చేస్తున్నారాయన. వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన ఇమ్రాన్ తమా బాధలు చెప్పుకోవడమే కాక ఎన్నాళ్ళ నుండో మన దేశంతో పడుతున్న కాశ్మీర్ సమస్యను కూడా లేవనెత్తాడు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతున్న సమయంలో కశ్మీర్ సమస్య పరిష్కారానికి ట్రంప్ ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతున్నట్టు ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. 

వెంటనే పెద్ద రాయుడిలా ఫీల్ అయిన ట్రంప్ కూడా అదెంత పని అంతే చేద్దామని మాటిచ్చాడు. రెండు వారాల క్రితం మోడీని కలిస్తే ఆయన కూడా సేమ్ టు సేమ్ నీలాగే మాట్లాడడని ఇమ్రాన్‌ తో అన్నారు ట్రంప్. అయితే నిజానికి కశ్మీర్ సమస్య పరిష్కారంలో మూడో దేశం జోక్యాన్ని సహించబోమని భారత్ చెబుతోంది. కానీ ప్రధాని మోదీ మాత్రం ఇబ్బందుల్లో పడిపోయారు. ఎందుకంటే అసలు మూడో దేశం జోక్యాన్నే ఇండియా ఇష్టపడక పోతే ట్రంప్ అబద్ధం చెప్పాడా?  లేక మోడీ నిజంగా అడిగాడా ? నిజంగానే అడిగితే అసలు మూడో దేశం ప్రమేయమే అక్కర్లేదని ఇక్కడ కబుర్లు చెప్పడం ఎందుకని మోడీ కార్నర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.