TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మరో మెంటల్ డెసిషన్ తీసుకున్న ట్రంప్

Published on: Thu Sep 14, 2017 3:16PM

 

మెంటల్ డెసిషన్లు తీసుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తర్వాతే ఎవరైనా. నలుగురికీ నచ్చినదీ నాకసలే నచ్చదు.. నలుగురూ నడిచే దారిలో నేను నడవను అన్నట్టుగా ఆయన బిహేవియర్ వుంటుంది. పోనీ ఆ బిహేవియర్ అయినా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా వుంటుందా అంటే అదీ కాదు. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా ట్రంప్‌కి అమెరికా అధ్యక్ష పదవి దొరికింది. దాన్ని అడ్డు పెట్టుకుని ఒక్క అమెరికాని మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలతో ఆడుకుంటున్నాడు. నిన్న మొన్నటి వరకూ ట్రంప్ పాకిస్తాన్‌ని తీవ్రవాద దేశమన్నాడు.. పాకిస్తాన్‌కి వార్నింగులు జారీ చేశాడు. ఇండియాకి అనుకూలంగా మాట్లాడాడు. అది చూసి మనం మురిసిపోయాం. ట్రంప్ మన జట్టే అనుకున్నాం. అయితే ఇప్పుడు ట్రంప్ భారత్ జుట్టు పట్టుకున్నాడు. ఇండియా పరువు తీసేలా వ్యవహరించాడు. డ్రగ్స్ ఉత్పత్తి చేయడంతోపాటు రవాణా చేసే 22 ఆసియా దేశాల లిస్టులో ఇండియాని కూడా చేర్చేశాడు. అది కూడా పాకిస్తాన్ పక్కనే మన దేశం పేరు కూడా పెట్టి తన మెంటల్ ప్రదర్శనకు తనకు ఏ దేశమైనా ఒకటేనని నిరూపించాడు.

డ్రగ్స్ తయారీ కుటీర పరిశ్రమలా వర్ధిల్లుతున్న దేశాల లిస్టులో ఇండియాని కూడా చేర్చడం చాలా అవమానకరం. ఇండియాలో కూడా డ్రగ్స్ వినియోగం, అక్కడక్కడా తయారీ వుంది. ఇది కాదనలేని వాస్తవం. కానీ ట్రంప్ విడుదల చేసిన దేశాల వరసన చేర్చదగ్గ స్థాయిలో మాత్రం ఇండియా లేదు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు పైకి స్నేహపూర్వకంగా మాట్లాడుతూ, అప్పుడప్పుడు ఇలా అంతర్జాతీయ స్థాయిలో అవమానానికి గురిచేసే చర్చలు చేయడం మెంటల్ ట్రంప్‌కే చెల్లింది.