భారతీయులకు ట్రంప్ భరోసా...ఎవ్వరూ బాధపడొద్దు..

 

అమెరికాలో ఉన్న భారతీయులకు ఎప్పుడూ షాకుల మీద షాకులు ఇచ్చే  ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... మొదటిసారి వారికి ఊరట కలిగించే విధంగా వ్యాఖ్యానించారు. అమెరికాలో ఎన్నో ఏళ్ల నుండి ఉంటూ..అక్కడి పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... అమెరికాకు వలస వచ్చి శ్రమిస్తున్న భారతీయులు బాధపడాల్సిన అవసరం లేదని.. వారికి తగిన ప్రోత్సాహకం అందుతుందన్నారు. స్విట్జర్లాండ్ బయలుదేరడానికి కొన్ని గంటల ముందు మీడియాతో మాట్లాడిన ఆయన, "ఎవ్వరూ బాధపడవద్దని వారికి చెప్పండి" అని ఎన్నారై ఇమిగ్రెంట్స్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇక, మెక్సికో సరిహద్దుల్లో గోడను కట్టి తీరుతామని, ఈ పని పూర్తయ్యేందుకు 10 నుంచి 12 సంవత్సరాల సమయం పట్టవచ్చని ట్రంప్ అంచనా వేశారు.