ట్రంప్‌లో ఊహించని మార్పు.. కిమ్‌తో చర్చలకు సై

గత కొద్దిరోజులుగా అమెరికా, ఉత్తరకొరియాల మధ్య జరుగుతున్న మాటల యుద్దంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. అటు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కానీ.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కానీ ఎక్కడా తగ్గకపోవడంతో ఏ క్షణమైనా యుద్ధం వస్తుందని ప్రపంచదేశాలు భయపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో తాను చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మేరీల్యాండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్‌ మాట్లాడుతూ.. నాకు ఆయనతో మాట్లడటానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే అందుకు కొన్ని షరతులు ఉంటాయి. వింటర్ ఒలింపిక్స్ నేపథ్యంలో ద.కొరియా, ఉ.కొరియా మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఇది నిజంగా చాలా గొప్పవిషయం.. నేను కలగజేసుకోకపోతే ఆ ఇరు దేశాల మధ్య ఎప్పటికీ చర్చలు జరిగేవి కావు.. చర్చలు ఫలిస్తే ప్రపంచానికే అది శుభవార్త అవుతుంది.