టూరిస్ట్ వీసా కూడా ఇక కష్టమే...


అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన దగ్గరనుండి వలసదారులకు షాకులమీద షాకులు ఇస్తూనే ఉన్నారు. ముస్లిం దేశాలపై నిషేదం విధించి అప్పుడు షాకివ్వగా.. ఆతరువాత గ్రీన్ కార్డ్, హెచ్1-బి వీసాపై ఆంక్షలు పెడుతూ మరో ఝలక్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా యూస్ వీసా ప్రాసెస్, టూరిస్ట్ వీసాపై కూడా ఆంక్షలు విధిస్తూ  వీసా ప్రాసెస్ మరింత కఠినతరం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా కఠినంగా ఉండే యూఎస్ వీసా ప్రాసెస్... మరింత క్లిష్టంగా మారబోతోంది. ఈ క్రమంలో, వీసా జారీ విధానంలో రెండు ప్రక్రియలు ఉండబోతున్నాయి. ఒకటి ప్రత్యేక పరిశీలన ద్వారా అవసరమైన వారిని గుర్తించడం. రెండోది వీసాలను మరింత కఠినం చేయడం.ఈ నేపథ్యంలో, అమెరికాకు పర్యాటక వీసా, వ్యాపార వీసాలపై వెళ్లడం కూడా కష్టతరం కానుంది. గత 15 ఏళ్లుగా ఎక్కడ నివాసం ఉన్నారు? ఏయే సంస్థల్లో ఉద్యోగం చేశారు? గత ఐదు ఏళ్లుగా వాడిన ఫోన్ నంబర్లు ఏమిటి?... తదితర వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.