ట్రంప్ కు షాకిచ్చిన పార్టీ నేతలు...

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. ఇప్పటివరకూ ఆయనే అందరికీ షాకిలిస్తుండగా.. ఇప్పుడు ఆయనకే షాక్ తగిలింది. ఇచ్చింది కూడా ఎవరోకాదు పార్టీ నేతలే. అసలు సంగతేంటంటే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒబామా హెల్త్ కేర్ స్థానంలో కొత్త హెల్త్ పాలసీని ప్రవేశపెట్టేందుకు ట్రంప్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికన్ కాంగ్రెస్ లో ఓటింగ్ జరగాల్సి ఉంది. అయితే ఈ ఓటింగ్ కు సొంత పార్టీ మద్దతే లభించలేదు. దీంతో ఈ పాలసీకి సంబంధించి ఓటింగ్‌ ను నేటికి వాయిదా వేశారు. నేడు కూడా దీనికి మద్దతు లభించని పక్షంలో సోమవారానికి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో  ట్రంప్‌ రిపబ్లికన్‌ సభ్యులకు అల్టిమేటం ఇచ్చారు. వైట్‌ హౌస్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌ మిక్‌ ముల్వానే మాట్లాడుతూ, అమెరికన్ కాంగ్రెస్ లో ఈ బిల్లు ఆమోదం పొందకపోతే, ఈ బిల్లును అమలు చేసేందుకు ట్రంప్‌ ఇతర మార్గాల్లో వెళ్తారని హెచ్చరించారు.