నెటిజన్లకు బుక్కయిన ట్రంప్ సంతకం... ఒకటే కామెంట్లు

 

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈనెల 20 న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఫైల్స్ మీద సంతకాలు చేసిన సంగతి కూడా విదితమే. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు ట్రంప్ సంతకంపైనే అసలు సమస్య వచ్చి పడింది. మన నెటిజన్లకు కాస్త తేడాగా ఏదన్న కనిపించినా.. అనిపించినా చాలు దానిపై కామెంట్ల మీద కామెంట్లు చేయనిదే ఊరుకోరు. అలాంటి వారికి ట్రంప్ సంతకం కంటపడింది. ఇంక అంతే ట్రంప్ సంతకాన్ని తమకు నచ్చినట్టు వర్ణించి సోషల్ మీడియాలో కామెంట్లు విసిరారు. ట్రంప్ సంతకాన్ని కొందరు సిస్మోగ్రాఫ్‌తో పోల్చగా.. మరికొందరు లై డిటెక్టర్ టెస్టు చార్ట్‌గా.. ఇంకొందరు సౌండ్ ఫ్రీక్వెన్సీతో పోల్చారు.