నాకు ట్వీట్స్ చేయడం ఇష్టం లేదు..

 

తనకు ట్వీట్లు చేయడం ఇష్టం లేదని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఉపయోగించుకోవడం ఇష్టం లేదు.. కానీ నాకు నమ్మకంలేని మీడియా, నమ్మకం లేని ప్రెస్‌ దొరికిందని.. తనకున్న మార్గం కేవలం సోషల్‌ మీడియా మాత్రమేనని తెలిపారు. కాగా ఈమధ్య ట్రంప్ తన అభిప్రాయాలను తరచూ ట్విట్టర్ ద్వారా తెలుపుతున్నసంగతి తెలిసిందే. అంతేకాదు అధ్యక్షుడిగా కూడా దీన్ని కొనసాగిస్తారా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ ‘అవును’ అని సమాధానం చెప్పారు.